Earn Money Online: ఈ వ్యాసంలో 5
మార్గాలలో ఆన్లైన్ ద్వారా డబ్బుని ఏవిధంగా సంపాదించాలి అనే విషయం గురించి
తెలుసుకుందాం.
Earn Money Online
మనలో చాలా మంది డబ్బును ఎక్కువ
రెండు రకాలుగా సంపాదిస్తుంటారు, ఉద్యోగం చేసి కొందరు వ్యాపారం చేసి కొందరు డబ్బు
సంపాదిస్తుంటారు. కానీ కొందరికి ఎలా సంపాదించాలి అనేది ఒక ప్రశ్నగా నిలిచిపోతుంది.
మనం ఈ వ్యాసంలో ఆన్లైన్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు ఎలా సంపాదించాలో
తెలుసుకుందాం. ఆన్లైన్‌లో డబ్బు సంపాదించడం అనగానే డేటా ఎంట్రీ (Data
Entry) జాబ్స్ అని అనుకుంటారు. కానీ అదికాదు. మరి అవేంటో ఆలస్యం
చేయకుండా చూద్దాం.
YouTube (యూట్యూబ్)
మనం రోజు ఉపయోగించే యూట్యూబ్
ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. మీకు బాగా అవగాహన ఉన్న విషయం మీద వీడియోస్
చేసి యూట్యూబ్ లో పెట్టండి. ఉదాహరణకు మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుందాం మీరు
రోజు ఇంగ్లీష్ సబ్జెక్టు గురించి మీ మొబైల్ లో వీడియోస్ రికార్డ్ చేసి కొంచెం
ఎడిట్ చేసి యూట్యుబ్ లో Upload చేయండి.
మీ వీడియోస్ కి వ్యూస్ వస్తాయి, అలాగే మీ ఛానల్ కి Subscibers
రావడం మొదలవుతుంది. వెయ్యి Subscribers మరియ 4
వేల (4000) గంటల వాచ్ టైం (Watch Time)
రాగానే మీరు Monetization కు అప్లై
చేసుకోవచ్చు. ఒకసారి MonetizationON అవ్వగానే మీకు Earnings
రావడం మొదలవుతుంది. దీనికి మీకు కావలసినది ఓపిక, పట్టుదల మాత్రమే.
Blog or Website
మీకు ఏదైనా ఒక విషయాన్ని, సమాచారంని వ్యాసంల రాసి
మీ బ్లాగ్ లేదా వెబ్సైటులో పెట్టండి. ఇలా చెయ్యడం ద్వారా మీ బ్లాగ్ లేదా
వెబ్సైటుకు వచ్చే Viewers మీ వెబ్సైటులో ఉన్న యాడ్స్ ని
చూసినందుకు మరియు వాటిని క్లిక్ చేసినందుకు గాను మీకు డబ్బులు వస్తాయి. దీనికోసం
మీరు చేయవల్సిందల్లా ఒక Website దీనికి వెయ్యి రూపాయాలు దాకా
ఖర్చు అవుతుంది. లేదా ఫీగా blog ను ఉపయోగించుకోవచ్చు.
Affiliate Marketing
నేడు మనం ఏమి కొనాలన్నా
ఆన్లైన్ లోనే కొంటున్నాం. కాబట్టి Affiliate Marketing చెయ్యడం ద్వారా
మనం పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
·
Affiliate Marketing అంటే ఏమిటి?
అప్లియేట్ మార్కెటింగ్
అంటే ఏదైనా ఒక వస్తువును మన ద్వారా ఇతరులు కొనడం. ఉదాహరణకు మీ స్నేహితుడు తనకి
నచ్చిన ఒక టీవిని ఆన్లైన్లో కొనాలి అనుకుంటాడు. మీరు అతనికి నచ్చిన టీవికి సంబధించిన
Link ని
మీ అఫ్లియేట్ అకౌంట్ నుండి తనకు పంపి కొనేటట్లు చేస్తే మీకు ఆ వెబ్సైటు ద్వారా
కొంత కమిషన్ వస్తుంది.
·
Affiliate అకౌంట్ ఎలా పొందాలి?
మీరు ఏ E-Commerce Site లో అయితే
అఫ్లియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైటు లోకి వెళ్లి Became
an Affiliate పై క్లిక్ చేసి సంబంధిత వివరాలను ఇచ్చి ఖాతాను ఓపెన్
చేయవచ్చు. తర్వాత సైట్ లోని వస్తువులను మార్కెటింగ్ చెయ్యడం ద్వారా డబ్బులు
సంపాదించవచ్చు. మీ మార్కెటింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యండం ద్వారా అవసరం
ఉన్న వాళ్ళు దానిపై క్లిక్ చేసి కొంటారు. దాని వల్ల మీరు ఎక్కువ ఆదాయం
పొందవచ్చు.
Facebook Page
ఫేస్బుక్ పేజి నుండి కూడా
డబ్బులు సంపాదించవచ్చు దానికి కావాల్సినవి.
![]() |
·
Facebook Page
మీకు ముందుగా ఏదైనా
విషయానికి సంబంధించిన ఒక Facebook page ఉండాలి. మీరు create చేసే
పేజి అందరికి నచ్చేలా ఉండాలి. కాబట్టి ఎలాంటి పేజి మరియు పోస్టలు పెడితే ఎక్కువ
మంది చూసి షేర్ చేస్తారో అలాంటి పేజిలను స్టార్ చేయండి. ఉదాహరణకు కామెడీ,
meme pages లాంటివి ఓపెన్ చేస్తే తొందరగా సక్సెస్ అవ్వచ్చు.
·
10K Followers
మీ ఫేస్బుక్ పేజీకి 10K followers ఉండాలి.
అప్పుడే Monetization enable అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు
డబ్బులు సంపాదించవచ్చు.
·
Videos with at least 3 minutes
వీడియోస్ upload చేసే ముందు అది 3 నిమిషాలకు మించి ఉండేలా చూసుకోండి. మీ ఫేస్బుక్ పేజిలో facebook
ads మాత్రమే కాకుండా మన Affiliate products ల
పోస్ట్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అంతే కాకుండా కొన్ని advertising కంపెనీస్ యాడ్స్ ని పోస్ట్ చేయడం ద్వారా సంపాదించవచ్చు.
Freelancer
Freelancer లో
మనం డబ్బులు సంపాదించాలి అంటే మనకు ఏదైనా ఒక పని పూర్తిగా వచ్చి ఉండాలి. ఉదాహరణకు
మీకు Logos బాగా డిజైన్ చేస్తారు అనుకుంటే మీరు Freelancer
Website లోకి వెళ్లి మీకున్న నైపుణ్యాలను మొదలైన సమాచారం
తిలియజేయాలి. ఇంతకు ముందు మీరు చేసిన Projects ఏవైనా ఉంటే
అందులో పొందుపరచాలి. మీ Profile చూసి నచ్చిన వారు మీకు పని
ఇస్తారు. ఈ విధంగా మీరు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు.
గమనిక:
తెలుగు పెన్సిల్‌లో ఇవ్వబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే.