Importance of Tirupati Gangamma Jathara | తిరుపతి గంగమ్మ జాతర ప్రాముఖ్యత

Tirupati-Gangamma-Jathara-History-and-Importance

    Tirupati Gangamma Jathara: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 13న ఒక GOని జారీ చేసింది అదే గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దీని గురించి చర్చ జరుగుతుంది. తిరుపతి గంగమ్మ జాతర చరిత్ర, ప్రాముఖ్యత మరియు విశిష్టత వంటి విషయాలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. 


Tirupati Gangamma Jathara అంటే ఏమిటి?


     ఆంధ్రప్రదేశ్ లో జరిగే వివిధ జాతరలు, తెలంగాణలో జరిగే బోనాలు, మేడారం జాతర్ల మాదిరే తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయంలో జరిగే జాతరనే గంగమ్మ జాతర అంటారు. ఈ జాతరకి తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచే కాకుండా రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వస్తారు. గంగమ్మ జాతర ఏడు రోజులపాటు జరుగుతుంది.  


Tirupati Gangamma Jathara తేదిలు


     ప్రతి సంవత్సరం మే నెలలో జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం మే 9వ తేదిన పుట్టింటి సారె, చాటింపుతో జాతర మొదలయ్యి, 16వ తేదిన అమ్మవారి చంప నరకడంతో జాతర ముగుస్తుంది.

 

Day

Weekdays

 

Vesham

1

మంగళవారం

 

చాటింపు

2

బుధవారం

 

భైరాగి వేషం

3

గురువారం

 

బండ వేషం

4

శుక్రవారం

 

తోట వేషం

5

శనివారం

 

దొర వేషం

6

ఆదివారం

 

మాతంగి వేషం

7

సోమవారం

 

సున్నపు కుండలు

8

మంగళవారం

 

గంగమ్మ జాతర

9

బుధవారం

 

విశ్వరూప దర్శనం



తిరుపతి గంగమ్మ ఆలయం చరిత్ర


     అనంతాళ్వార్ అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వరస్వామికి తిరుపతి గంగమ్మ సోదరి అని చెబుతూ, తాతయ్యగుంటలో గంగమ్మకు ఆలయం కట్టించారని స్థల పురాణం.


Tirupati-Gangamma-Jathara-tp-06
తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, తిరుపతి


    Tirupati Gangamma Jathara : తిరుపతిలో జరిగే ఈ జాతరే దేశంలో జరుపుకున్న మొట్ట మొదటి జాతరగా చెబుతారు. ఈ ఆలయం 1400 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉందని ఆధారాలు ఉన్నాయి. 1100వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని కొలిచిన అనంతాళ్వార్ గంగమ్మను పునః ప్రతిష్టించినట్టు ఆధారాలు ఉన్నాయి. మొదట వెంకటేశ్వరస్వామి చెల్లి అయిన గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాకే శ్రీవారి ఆలయానికి వెళ్లే ఆచారం అప్పట్లో ఉండేది. రాను రాను ఈ ఆచారం కనుమరుగైపోయింది.


తిరుపతి గంగమ్మ చరిత్ర


     తిరుపతి గంగమ్మ గురించి ఒక కథ ప్రాచూర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్ల రాజు పరిపాలించే కాలంలో, ఒక పాలెగాడు అందమైన అమ్మయిలను కనపడితే చాలు అత్యాచారం చేసేవాడు. కొత్తగా పెళ్ళైన వధువుతో మొదటి రాత్రి తనతోనే జరగాలి అని ఆంక్షలు పెట్టాడు. ఆ పాలెగాడిని చంపి మహిళలను కాపాడేందుకు గంగమ్మ తల్లే తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మించిందని భక్తుల నమ్మకం.


తిరుపతి గంగమ్మ తల్లి
    

    యవ్వనంలోకి వచ్చిన గంగమ్మని చూసిన పాలెగాడు తనపై కన్నేసాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ తల్లి విశ్వరూపం చూపించింది. తనను అంతం చేయడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు ఎక్కడికో వెళ్లి పారిపోయి దాక్కుంటాడు. గంగమ్మ పాలెగాడిని వెతకడం కోసం రకరకాల వేషాలలో 3 రోజుల పాటు వెతుకుతుంది. మొదటి రోజు బైరాగి వేషంలో, రెండవ రోజు బండ వేషంలో, మూడవ రోజు తోటి వేషంలో వెతుకుతుంది.      

    

    మూడు రోజులు మూడు వేషాలు వేసి వెతికినా పాలెగాడు కనిపించకపోవడంతో, నాల్గవ రోజు గంగమ్మ దొర వేషం వేసుకుంటుంది. దొర వచ్చాడు అని అనుకున్న పాలెగాడు దాక్కున్న చోటునుండి బయటకు వచ్చాడు. వెంటనే అతడిని చంపి గంగమ్మ దుష్ట శిక్షణ షిష్ట రక్షణ చేసింది. గంగమ్మ రకరకాల వేషాలు వేసి పాలేగాడిని చంపిన దానికి గుర్తుగా ఈ రోజు వరకూ తిరుపతి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాతర  జరుపుకుంటున్నారు. గంగమ్మ తల్లి తమను కూడ రక్షించాలి అని జాతర చేసి మొక్కులు చెల్లిస్తారు.


జాతరలో వేసే వేశాలు వాటి వేనుక ఉన్న అర్ధాలు:


1.   మొదటి రోజున వేసే బైరాగివేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తారు.

2.   రెండో రోజు బండ వేషాన్ని మనిషి కష్టనష్టాలకు వెనుకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుంది.

3.   మూడో రోజు చిన్న పిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం.

4.   నాలుగో రోజు దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు.

5.   ఐదో రోజు మాతంగి వేషం.

6.   ఆరో రోజు సున్నపుకుండల వేషం వేస్తారు.


Tirupati-Gangamma-Jathara-tp-01
Tirupati Gangamma Jathara వేశాలు

సోదరికి వెంకటేశ్వరుడి సారె:


     తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సోదరి గంగమ్మకు పుట్టింటి సారె పంపే ఆచారం గత 400 ఏళ్ల నుంచీ కొనసాగుతోంది.


Tirupati Gangamma Jathara ఘట్టాలు


1.   తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చిత్ర నెల చివరి మంగళవారం అంటే మే మెదటి లేక రెండవ వారంలో చాటింపు జరుగుతుంది.

2.   ఉదయం గుడి ఆవరణలో అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేసి, వడిబాల కడతారు.

3.   సాయంత్రం గంగమ్మ జన్మ స్థలం అయిన అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు మరియు సారెను తీసుకువస్తారు.

4.   ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు పొలిమేరల్లో చల్లుతూ, జాతర పూర్తి అయ్యే వరకు ఊరి ప్రజలు పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు.


Tirupati Gangamma Jathara నైవేద్యాలు


·       జంతుబలిపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లలో మేకలు, కోళ్లు కోస్తారు.

·       స్త్రీలు ఆలయంలో పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

·       కొందరు రాగి అంబలి పెడతారు.

·       మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

·       కొంత మంది చాటుగా సారా, కల్లు వంటివి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.


Tirupati-Gangamma-Jathara-tp-03
Tirupati Gangamma Jathara పొంగళ్ళు

Tirupati Gangamma Jathara సమయాలు


·       మే 5న కంచి పరమాచార్య విజయేంద్ర సరస్వతి కుంభాభిషేక కార్యక్రమం.

·       మే 9న చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది.

·       మే 10న జాతరకు సంబంధించిన వేషాలు వేస్తారు.

·       మే 16 వరకు జాతర జరుగుతుంది.


Tirupati Gangamma Jathara ప్రత్యేకం బూతుల దండకం


     కొందరు భక్తులు రకరకాల వేశాలు వేసి నోటికి వచ్చిన భూతులు తిడుతూ చుట్టు పక్కల ప్రాంతాల్లో తిరగడం గంగమ్మ జాతరలో ఒక భాగం. మిగతావారు వాటిని వింటు నవ్వుతూ తేలిగ్గా తీసుకుంటారు. దీనికి కారణాలు


1.   మన కొన్ని దేవాలయాలపై బూతు బొమ్మలు ఉండటం.

2.   బూతులు తిట్టే ఆచారం తిరుపతిలో ఉండటం.

3.   పూరీలోని జగన్నాథ రథయాత్రలో రథం ఆగిపోయినప్పుడు కూడ బండ బూతులు తిడతారు, తిట్టకపోతే మహా పాపంగా బావిస్తారు.

4.   గంగమ్మ పాలేగాడిని బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి వేషం వేసే వాళ్లు బూతులు తిడతారు.

5.   మనకు ఎవరి మీదైన కోపం ఉంటే వారిని తిట్టేస్తే మన మనసులో ఉన్న కోపం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాము.


Tirupati Gangamma Jathara విశ్వరూప దర్శనం


     ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో నాల్గవ రోజున పాలెగాడిని చంపిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి వేషంలో పాలెగాడి ఇంటికి వెళ్లి బాధపడుతున్న ఆయన భార్యను మరియు పిల్లలను ఓదారుస్తుంది. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఐదవ రోజున మాతంగి వేషాలు వేస్తారు. ఆరవ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడవ రోజున గంగమ్మ జాతర జరుగుతుంది. గోపురాల్లో ఉండే సప్పరాలను శరీరంపై నిలబెట్టుకుంటారు. ఇవిధంగా చేస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు.      

    

    ఇక చివరి రోజున అత్యంత ముఖ్యమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. ఎనిమిదవ రోజు తెల్లవారు జామున 4 గంటలకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు రాత్రి నుంచే ఎదురుచూస్తారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు, పూజారులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి తరువాత, ఆలయం ముందు మట్టితో చేసిన గంగమ్మ తల్లి విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.


గంగమ్మ విశ్వరూప దర్శనం

    ఒక వ్యక్తి పేరంటాళ్ళు లాగా వేషం వేసి విశ్వరూపం విగ్రహా చెంప నరుకుతాడు. ఆ విగ్రహం నుంచి తీసిన మట్టినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.

Post a Comment

Previous Post Next Post