Shodasha Ganapathi | షోడశ గణపతి

 

Shodasha- Ganapathi


    Shodasha Ganapathi : విఘ్యాధిపతి అయిన వినాయకుడికి 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవి. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానికీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం. 


Shodasha Ganapathi


     గణపతిని గూర్తి తెలియనివారుండరు. ఆబాలగోపాలం ఆరాధ్యదైవం ఆయన. గణపతి ఒక్కడే, కానీ ఆయన భక్తులు మాత్రం కోటానుకోట్లు. వారందరి కోరికలనూ గణపతి ఒక్కో రూపంలో నెరవేరుస్తుంటాడు. (Shodasha Ganapathi) గణపతికి గల పదహారు విభిన్నరూపాలలో ఒక్కో రూపం భక్తులకు ఒక్కో ఫలాన్ని అనుగ్రహిస్తుంది. బాలగణపతి మొదలుకొని ఊర్ధ్వ గణపతి వరకు వీరందరూ నిత్యం మనకు ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారమార్గాన్ని చూపుతున్నారు. ఇలా Shodasha Ganapathiని ఆరాధిస్తే వచ్చే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు వినాయక చవితి పండుగ సందర్భంగా Shodasha Ganapathi సమాహారం. 


బాలగణపతి


     ఈ దేవుని ఆరాధనచే బుద్ధివికాసం కలుగుతుంది. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడిచేతిలో అరటిపండు, పనసతొన, ఎడమ చేతిలో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని ఉంటాడు. 


Bala_Ganapati_telugu_pencil
బాలగణపతి

తరుణ గణపతి


     ఈ దేవుని ఆరాధనచే కార్యసాధనకు అవసరమైన దీక్ష మరియు మనోధైర్యం వృద్ధి పొంది సిద్ధి కలుగుతుంది. ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి చేతిలో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ చేతిలో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను ధరించి ఉంటాడు. 


Taruna_Ganapati_telugu_pencil
తరుణ గణపతి

భక్తి గణపతి


        ఈ దేవుని ఆరాధనచే ఉపాసకులలో భక్తిభావం వృద్ధి పొంది సిద్ధి కలుగుతుంది. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి చేతిలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ చేతిలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర ధరించి ఉంటాడు. 


Bhakti_Ganapati_telugu_pencil
భక్తి గణపతి

వీర గణపతి


        ఈ స్వామి ధ్యాన, ఆరాధనల వల్ల భక్తునికి ధైర్యశౌర్యాలు కలుగుతాయి. ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి. కుడిచేతిలో  బాణం,బేతాళుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం గొడ్డలి బొమ్మ ఉన్న జెండా ఎడమ చేతిలో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి ఉంటాడు. 


Vira_Ganapati_telugu_pencil
వీర గణపతి

శక్తి గణపతి


     ఈ దేవుని ధ్యాన ఆరాధనల వల్ల ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడిచేతిలో అభయ ముద్ర, అక్షమాల ఎడమ చేతిలో అంకుశం పట్టుకుని ఉంటాడు. 


శక్తి గణపతి


ద్విజ గణపతి


     ఈ స్వామి ధ్యాన, ఆరాధనలు సమగ్రంగా ఆలోచించే శక్తిని, తెలివి తేటలు ప్రసాదిస్తాడు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడిచేతిలో పుస్తకం, దండం ఎడమ చేతిలో అక్షమాల, కమండలం పట్టుకుని ఉంటాడు. 


Dvija_Ganapati_Telugu_Pencil
ద్విజ గణపతి


సిద్ధి గణపతి    

  

    సిద్ధి బుద్ధులనే తన శక్తులుగా చేసుకునియున్న ఇతడి ఆరాధాన, ధ్యానాలు భక్తునికి సకలకార్యాల్లోనూ సిద్ధిని ప్రసాదిస్తూ ఓటమే ఎరుగని విజేతగా నిలుపుతాయి. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడిచేతిలో పండిన మామిడిపండు ఎడమ చేతిలో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని ఉంటాడు. 


Siddhi_Ganapati_Telugu_Pencil
సిద్ధి గణపతి


ఉచ్ఛిష్ఠ గణపతి


     ఈ స్వామి మంత్రమూర్తి. ఎంత వేగంగా కోరికలు తీరుస్తాడో, అశ్రద్ధ, అనుమానాలకు తీవ్రశిక్షను కూడా అంతే వేగంగా విధిస్తాడు. ఏ చిన్నలోపాన్ని కూడా ఇతడు సహించడు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడిచేతిలో నల్ల కలువ, వరివెన్ను ఎడమ చేతిలో దానిమ్మ పండు, జపమాల ధరించి ఉంటాడు.  


Uchhishta_Ganapati_Telugu_Pencil
ఉచ్ఛిష్ఠ గణపతి

విఘ్న గణపతి


          ఈ స్వామిని ధ్యానించి, ఆరాధిస్తే భక్తుల విఘ్నాలు తొలగించి, వారికి యశస్సు కలుగజేస్తాడు. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడిచేతిలో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి ఎడమ చేతిలో చెరకు, పాశం, పూలబాణం, విరిగిన దంతం, బాణాలు ధరించి ఉంటాడు. 

Vighna_Ganapati_Telugu_Pencil
విఘ్న గణపతి
  

క్షిప్ర గణపతి     


    ఈ స్వామి ఆరాధనచే ఇష్టార్ధసిద్ధి కలుగుతుంది. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి చేతిలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ చేతిలో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి ఉంటాడు. 


Kshipra_Ganapati_Telugu_Pencil
క్షిప్ర గణపతి

హేరంబ గణపతి


     ఈ స్వామి ఆరాధనచే ప్రయాణలలో కలిగే గండాల నుండి రక్షింపబడతారు. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి చేతిలో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ఎడమ చేతిలో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, పాశం, అంకుశం, ముద్గరం ధరించి ఉంటాడు. 


Heramba_Ganapati_Telugu_Pencil
హేరంబ గణపతి

శ్రీ లక్ష్మీగణపతి


    ఈ స్వామి ఆరాధనచే భక్తులు విశేషమైన ధన, ధాన్య సమృద్ధి పొందుతారు. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి చేతిలో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ఎడమ చేతిలో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి ఉంటాడు. 


Sri_Lakshmi_Ganapati_Telugu_Pencil
శ్రీలక్ష్మి గణపతి

మహా గణపతి


          ఈ గణపతి భక్తులపాలిటి కామధేనువు, ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. సకల సంకష్టాల నుండి, గ్రహబాధల నుంచి భక్తులను ముక్తులను చేసే మహాదేవుడితడు. ఈ గణపతి రూపానికి పది చేతులుంటాయి కుడి చేతిలో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, కలువ, పద్మం, విరిగిన దంతం ఎడమ చేతిలో చక్రం, గద, పాశం, వరికంకి రత్నాలు పొదిగిన కలశం ధరించి ఉంటాడు. 


Maha_Ganapati_Telugu_Pencil
మహా గణపతి

విజయ గణపతి


          ఈ స్వామిని ధ్యానిస్తే, ఆరాధిస్తే భక్తులకు అంతటా జయాలు కలుగుతాయి. ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి చేతిలో పాశం, విరిగిన దంతం ఎడమ చేతిలో  అంకుశం, మామిడి పండు ధరించి ఉంటాడు. 


Vijaya_Ganapati_Telugu_Pencil
విజయ గణపతి

నృత్య గణపతి


     కల్పవృక్షపు క్రింది విభాగంలో ఉన్న ఈ స్వామిని ఆరాధిస్తే సంతృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. ఈ గణపతి కుడి చేతిలో పాశం, అప్పాలు, ఎడమ చేతిలో  అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి ఉంటాడు. 


Nrutya_Ganapati_Telugu_Pencil
నృత్య గణపతి

ఊర్ధ్వ గణపతి


        ఈ స్వామి ఆరాధనచే మహాపాపాల నుండి, బాధల నుంచి, కారాగారశిక్షల నుండి విముక్తి కలుగుతుంది. ఈ గణపతి కుడి చేతిలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం ఎడమ చేతిలో చెరుకు ముక్క, వరివెన్ను, బాణం, మొక్కజొన్న కండె ధరించి ఉంటాడు.


Urdhva_Ganapati_Telugu_Pencil
ఊర్ధ్వ గణపతి



Post a Comment

Previous Post Next Post