Sri Varahi Devi Navaratri Pooja Vidhanam | శ్రీ వారాహి దేవి నవరాత్రి పూజ విధానం

 

Sri-Varahi-Devi- Navaratri-Pooja-Vidhanam

Sri Varahi Devi Navaratri Pooja Vidhanam:

Sri Varahi Devi Navaratri Pooja కి కావాల్సిన వస్తువులు

 

    దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.

 

మార్జనము

 

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః

(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)

 

 

గణపతి ప్రార్దన

 

(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.


దీపారాధన

 

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే

 

 

ఆచమనము

 

1.   ఓం కేశవాయ స్వాహా

2.   ఓం నారాయణాయ స్వాహా

3.   ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)

స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.

4.   ఓం గోవిందాయ నమః

5.   ఓం విష్ణవే నమః

6.   ఓం మధుసూదనాయ నమః

7.   ఓం త్రివిక్రమాయ నమః

8.   ఓం వామనాయ నమః

9.   ఓం శ్రీధరాయ నమః

10.  ఓం హృషీకేశాయ నమః

11.  ఓం పద్మనాభాయ నమః

12.  ఓం దామోదరాయ నమః

13.  ఓం సంకర్షణాయ నమః

14.  ఓం వాసుదేవాయ నమః

15.  ఓం ప్రద్యుమ్నాయ నమః

16.  ఓం అనిరుద్ధాయ నమః

17.  ఓం పురుషోత్తమాయ నమః

18.  ఓం అధోక్షజాయ నమః

19.  ఓం నారసింహాయ నమః

20.  ఓం అచ్యుతాయ నమః

21.  ఓం జనార్ధనాయ నమః

22.  ఓం ఉపేంద్రాయ నమః

23.  ఓం హరయే నమః

24.  ఓం శ్రీకృష్ణాయ నమః

 

(కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)

 

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

 

ప్రాణాయామము

 

పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం

ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ శంకరం

(ప్రాణాయామం చేయండి)

  

సంకల్పము

 

     మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వారాహీ దేవతా ప్రీత్యర్థం, సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్ధం, ధన కనక వస్తు వాహనాది సమృధ్యర్ధం, సర్వతోముఖాభి వృధ్యర్థం, మహాకాళీ మహలక్ష్మీ మహా సరస్వతీ స్వరూప వారాహీ దేవతాం ఉద్దిశ్య యావఛ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!

 

(కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి)

 

ఘంటా నాదం చేస్తూ

 

(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం

కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్

 

కలశారాధన

 

కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు

పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య

 

(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి) 

 

గణపతి పూజ

 

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

 

ఆదౌ నిర్విఘ్నం పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే

 

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప

ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంభః స్కంధపూర్వజః

షోడశైతాని నామని యఃపఠేచ్ఛృణుయాదపి.

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా,

పూజాది సర్వకారేషు విఘ్నస్తస్య నజాయతే

 

శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృణామి

 

(ఈ క్రింది ప్రాణ ప్రతిష్ఠ మొదటిరోజు మాత్రమే చేయాలి. మిగితా రోజుల్లో చేయకూడదు)

 

ప్రాణ ప్రతిష్ఠ

 

------------ ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభం (First Day Only ) --------------

 

మేఘశ్యామరుచిం మనోహర కుచాం నేత్రత్రయోధ్భాసితాం

కోలాస్యాం శశిశేఖరాం అచలితైః దంష్టాతలైః శోభితామ్

బిభ్రాణాం స్వకరాంబుజై రసిలతాం చర్మాసి పాశం సృణీం

వారాహీం అనుచింతయేత్కిరివరా రూఢాం శుభాలంకృతీం

 

సాంగాం సాయుధం సవాహనాం సశక్తిం పతి పుత్ర పరివార సమేతాం

శ్రీ వారాహీ మాతాం ఆవాహయామి స్థాపయామి, పూజయామి

 

-------------  ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ సమాప్తం ------------------

 

 

వారహీ దేవి షోడశోపచార పూజ

 

ధ్యానం

కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్థాం మహోదరీం

వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణే కరే

ఖేట పాత్రాఽభయాన్ వామే సూకరాస్యాం భజామ్యహం 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః ధ్యాయామి

(అక్షింతలు సమర్పించవలెను)


ఆవాహనం

శ్లోకం

ఉగ్ర రూపాం మహాదేవీం శత్రు నాశన తత్పరాం

త్రిశక్తిరూపిణీ మంబాం వందేహం కార్య సిద్ధయే

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః ఆవాహయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

ఆసనం

శ్లోకం

సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే

రత్న సింహాసన మిదం దండనాధాం ప్రగృహ్యతామ్

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం మమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

పాద్యం

శ్లోకం

సురాసుర మహా మౌళీ మాలా మాణిక్య కాంతిభిః

విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

అర్ఘ్యం

శ్లోకం

పుష్పచందన దూర్వాది సంయుతం జహ్నవీ జలం

శంఖ గర్భ స్థితం శుద్ధం గృహ్యతాం సమయేశ్వరీ

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

ఆచమనీయం

శ్లోకం

పుణ్య తీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా

గృహాణాచమనం దేవీ రిపు సంహార తాండవీం 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

శుద్ధోదక స్నానం

శ్లోకం

పయోదధి ఘృతో పేతం శర్కరా మథు సంయుతం

పంచామృత మిదం స్నానం గృహాణ సురపూజితే 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి

తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

వస్త్రం

శ్లోకం

ధరణీ ధారిణీ ధేనుర్ ధరిత్రీ ధావనీ ధవా

కృష్ణాంబరం ప్రయఛ్చామి విద్యుత్ అంగ జటాధరే 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి

వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)

 

యజ్ఞోపవీతం

శ్లోకం

ఋగ్యజుః సామ రూపాచ పరా పోత్రిణ్యుదుంబరాం

సౌవర్ణం యజ్ఞ సూత్రంతే, దదామి పరమేశ్వరీ 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

గంధం

శ్లోకం

కస్తూరీ కుంకుమైర్ యుక్తం ఘనసార విమిశ్రితం

మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః శ్రీ గంధాన్ ధారయామి

హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి

(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)


పుష్పం - ఆభరణం

శ్లోకం

తురీయ వన సంభూతం నానా గుణ మనోహరం

ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం పరదేవతాం 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః పుష్పాభరణాని సమర్పయామి

(పుష్పాలు సమర్పించవలెను)

 

అంగపూజ

 

శ్రీ వారాహ్యె నమః                          - పాదౌ పూజయామి

భక్తోపద్రవ నాశిన్యై నమః                   - గుల్ఫౌ పూజయామి

పీఠాత్మికాయై నమః                         - జానునీ పూజయామి

ఉన్మత్త భైరవాంకస్థాయై                     - ఊరూం పూజయామి

సింహవాహనాయై నమః                    - కటిం పూజయామి

నీలాస్యాయై నమః                           - నాభిం పూజయామి

పంచమ్యె నమః                              - ఉదరం పూజయామి

పరమేశ్వర వల్లభాయై నమః                - హృదయం పూజయామి

ఘనస్తన సమోపేతాయై నమః              - స్తనౌ పూజయామి

ముసలధారిణ్యై నమః                        - భుజద్వయం పూజయామి

భక్తానాం అభయ ప్రదాయై నమః          - కంఠం పూజయామి

క్రోడాననాయై నమః                         - ముఖం పూజయామి

సునాసికాయై నమః                          - నాసికాం పూజయామి

కపిల లోచనాయై నమః                     - నేత్రే పూజయామి

చింతితార్ధ ప్రదాయిన్యై నమః               - కర్ణా పూజయామి

అశుభ వారిణ్యై నమః                       - లలాటం పూజయామి

వరాహ వదనాయై నమః                    - శిరః పూజయామి

శత్రు నాశిన్యై నమః                          - సర్వాణ్యంగాని పూజయామి

 

వారాహీ స్తుతి

నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి

జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే

 

జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నమామ్యహం

జయవారాహి విశ్వేశి ముఖ్యవారాహితే నమః

 

ముఖ్యవారాహి వందేత్వాం అంధే అంధినితే నమః

సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ నమః

 

నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంబిణితే నమః

రుంధే రుంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ

 

స్వభక్తానాంహి సర్వేషాం సర్వకామ ప్రదే నమః

బాహ్వోః స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః

 

చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః

జగత్ స్తంభిని వందేత్వాం జిహ్వా స్తంభన కారిణి

స్తంభనం కురు శత్రూణాం కురుమే శత్రు నాశనం

శీఘ్రం వశ్యంచ కురుతే యోఽగ్నే వాచాత్మికే నమః

 

ఠ చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే

హుమాత్మికే ఫట్ రూపేణ జయ ఆధ్యాననే శివే

 

దేహిమే సకలాస్ కామాన్ వారాహీ జగదీశ్వరీ

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

 

అనుగ్రహ స్తుతి:

కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం

కిం దుర్లభం త్వయి విధానువ దర్చితాయామ్

కిం దుష్కరం త్వయి సకృత్ స్మృతి మాగతాయాం

కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాద పుంసామ్

 

Sri Varahi Devi Ashtottara Shatanamavali | శ్రీ వారాహి దేవి అష్టోత్తర శతనామావళిః

 

ధూపం

శ్లోకం

వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధైః సుసంయుతం

ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః ధూపం అఘ్రాపయామి

(ధూపం చూపించాలి)

 

దీపం

శ్లోకం

జగచ్చక్షుః స్వరూపంచ ప్రాణరక్షణ కారణం

ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతాం పరమేశ్వరి 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః దీపం దర్శయామి

ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి

(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)

 

నైవేద్యం

శ్లోకం

శర్కరా మధు సంయుక్తం, ఆజ్యాదైః అధపూరితం

గృహాణ దేవీ నైవేద్యం, భక్తోపద్రవ నాశినీ 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి

 

(జలం సమర్పిస్తూ చదవాలి)

సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)

అమృతమస్తు అమృతోపస్తరణమసి

 

ఓం ప్రాణం నమః  - అపానం నమః – వ్యానం నమః

ఉదానం నమః – సమానం నమః

 

(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి

ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి

పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి

 

తాంబూలం

శ్లోకం

పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం

కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి

(తాంబూలం సమర్పించవలెను)

 

నీరాజనం

శ్లోకం

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం

తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ హల ధారిణీ

సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు 

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః కర్పూర నీరాజనం దర్శయామి

(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)

 

మంత్రపుష్పం - నమస్కారం

(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)

శ్లోకం

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ

తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా

వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞాచక్రేశ్వరీ తథా

అరిఘ్యీ భూమి రూపేణ కురుమే శత్రు నాశనం

ఉపచారం

శ్రీ వారాహీ దేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

 

క్షమా ప్రార్ధన– స్వస్తి

(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ

సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి

 

మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ

యత్పూజితం మాయా దేవి పరిపూర్ణం తదస్తుతే

అనయా యధా శక్తి పూజయాచ భగవతీ సర్వాత్మికా

 

శ్రీ వారాహీ దేవతా సుప్రసన్నః స్సుప్రీతో వరదో భవతు

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా

గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు

 


------------ ఆఖరి రోజు ఉద్వాసన చెప్తూ (Last Day Only) --------------



సహస్త్ర పరమాదేవీ శతమూలా శతాంకురా

సర్వగ్ం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ

జయదేవీ నమస్తుభ్యం జయభక్త వరప్రదే

జయ శంకర వామాంగీ మంగళే సర్వ మంగళే

శ్రీ వారాహీ దేవ్యై నమః యధా స్థానం ఉద్వాసయామి – పునరాగమనాయచ


-------------  ఉద్వాసన ప్రక్రియ సమాప్తం ------------------


కలే వర్షతు పర్జన్యః  పృథివీ సస్య శాలినీ

దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః

అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః

అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం

 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు


(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)

మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.

Post a Comment

Previous Post Next Post